Friday, November 22, 2024

స్థిరంగా బంగారం ధ‌ర‌లు-అదే దారిలో వెండి

బంగారం ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. అదే దారిలో వెండి ధ‌ర‌లు కొన‌సాగుతున్నాయి. కాగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,150గా నమోదవుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,530గా ఉంది. రెండు రోజుల పాటు ధరలలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు ఏకంగా రూ.400 మేర ధర పెరగడంతో.. రూ.47,750 నుంచి రూ.48,150కు ఈ ధర వచ్చి చేరింది. బంగారంతో పాటు వెండి రేటు కూడా స్థిరంగా కొనసాగుతోంది.

కేజీ వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ.64,800గా పలుకుతోంది. హైదరాబాద్‌తో పాటు దేశ రాజధానిలో కూడా బంగారం ధరలు స్తబ్దుగా ఉన్నాయి. అక్కడ కూడా ధరలలో ఎలాంటి మార్పు లేదు. దీంతో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300గా పలుకుతోంది. అంతేకాక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,690గా రికార్డయింది. ఇక సిల్వర్ రేటు ఢిల్లీ మార్కెట్లో కేజీ రూ.59,300గా ఉంది. విజయవాడ మార్కెట్లో బంగారం ధరలు.. 22 క్యారెట్లకు చెందిన ధర రూ.48,150గా, 24 క్యారెట్ల ధర రూ.52,530గా నమోదవుతోంది. విజయవాడలో కేజీ సిల్వర్ రేటు స్థిరంగా రూ.64,800 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement