Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు -త‌గ్గిన వెండి రేటు

మూడురోజులుగా పెరుగుతూ వ‌స్తున్నాయి బంగారం ధ‌ర‌లు. కాగా నేడు మే 27న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గింది. దీంతో ఈ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 51,980కు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు రూ. 250 తగ్గింది. రూ. 47,650కు క్షీణించింది. కాగా బంగారం ధర గత మూడు రోజుల్లో రూ. 900కు పైగా బంగారం ధ‌ర పెరిగిన విషయం తెలిసిందే. వెండి రేటు కూడా పడిపోయింది. సిల్వర్ రేటు కేజీకి రూ. 500 తగ్గింది. దీంతో దీని రేటు రూ.66 వేలకు క్షీణించింది. కాగా వెండి రేటు నిన్న రూ. 400 పరుగులు పెట్టిన విషయం మనకు తెలుసు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1847 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర 0.04 శాతం తగ్గింది. దీని రేటు ఔన్స్‌కు 21.97 డాలర్ల వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement