Thursday, November 21, 2024

స్వ‌ల్పంగా త‌గ్గిన ‘బంగారం, వెండి’ ధ‌ర‌లు

గ‌త రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌లు నేడు నేల చూపులు చూసింది. పసిడి రేటు పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కూడా దిగొచ్చింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 దిగొచ్చింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,310కు క్షీణించింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.250 తగ్గుదలతో రూ. 47,950కు దిగొచ్చింది. బంగారం ధరలు నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 700 పడిపోయింది. సిల్వర్ రేటు రూ. 72,700కు దిగొచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement