నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా బంగారం ధరలలో పెద్దగా ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.47,100 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ మార్కెట్లో సిల్వర్ ధర కూడా రూ.200 పెరిగి రూ.63,700 వద్దకి పెరిగింది. బంగారం ధర పెరుగుదలకైనా, తగ్గుదలకు అయినా అత్యంత ప్రధాన కారకం ఫెడరల్ రిజర్వు రేటు. ఇటీవల ఈ రేట్లు అత్యధికంగా పెరుగుతూ ఉండటంతో.. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. డాలర్ ఇండెక్స్ పెరుగుతూ.. బంగారాన్ని కుప్పకూల్చింది. ఈ పండగ సీజన్ అంతా బంగారం ధరలు ప్రజలకు ఆకర్షణీయంగా ఒత్తిడిలోనే కొనసాగాయి. తాజాగా మరోసారి ఫెడరల్ రిజర్వు మీటింగ్ జరగబోతుంది. వచ్చేవారం జరిగే ఈ మీటింగ్ వరకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్ 1630 డాలర్ల నుంచి 1685 డాలర్ల మధ్యలో ట్రేడవుతాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ తెలిపింది.