Saturday, November 23, 2024

స్థిరంగా బంగారం ధ‌రలు-పుత్త‌డి బాట‌లోనే వెండి

నేడు బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ఈరోజు పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. పుత్తడి బాటలోనే వెండి కూడా పయనించింది. సిల్వర్ రేటు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. నిన్న పడిపోయిన పసిడి రేటు ఈరోజు స్థిరంగా కొనసాగడం గమనార్హం. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్‌లో ఆగస్ట్ 12న 24 క్యారెట్లు, 22 క్యారెట్లు బంగారం ధరలు వరుసగా రూ. 51,650గా, రూ. 47,350గా ఉన్నాయి. బంగారం ధర నిన్న రూ. 650కి పైగా పడిపోయిన విషయం తెలిసిందే. వెండి ధర విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కేజీకి రూ. 64,200 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ రేటు 0.18 శాతం దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1803 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే సిల్వర్ రేటును గమనిస్తే.. 0.55 శాతం పడిపోయింది. వెండి రేటు ఔన్స్‌కు 20.23 డాలర్ల వద్ద కదలాడుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి రేటు స్థిరంగా కొనసాగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement