నేటి బంగారం ..వెండి ధరలు ఇలా ఉన్నాయ.. దేశీయంగా చూస్తే బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.50,250 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాములకు రూ.170 మేర పెరిగి ప్రస్తుతం రూ.54,820 వద్ద కొనసాగుతోంది. ఇవి 9 నెలల గరిష్టం కావడం గమనార్హం. దేశరాజధాని దిల్లీలో గోల్డ్ రేటు హైదరాబాద్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది.
అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.50,400 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.54,980 వద్ద ట్రేడవుతోంది. వెండి విషయానికి వస్తే దిల్లీలో తక్కువగా ఉంటుంది. కిలో వెండి రేటు దేశ రాజధానిలో రూ.70,100 వద్ద ఉండగా.. హైదరాబాద్‌లో అదే సిల్వర్ రేటు రూ.74,700 వద్ద ఉంది. క్రితం రోజు ఇది ఏకంగా రూ.2,200 మేర పెరిగింది. మరి ఇప్పుడు అంతర్జాతీయంగా రేట్లు తగ్గిన నేపథ్యంలో దేశీయంగా కూాడా ఆ ప్రభావం కనిపిస్తుందో లేదో వేచి చూడాలి. తగ్గే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి.