Saturday, November 23, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా రేట్లు గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.49,600 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర రూ.54,110 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.49,750 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.54,260 వద్ద ఉంది. డిసెంబర్ 20న ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మళ్లీ పెరిగే అవకాశాలే ఉన్నాయి.

వెండి ధరల విషయానికి వస్తే దిల్లీలో తాజాగా రూ. 200 తగ్గి రూ.69,300 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు 2 రోజుల్లో మాత్రం రూ.500 పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.600 మేర పతనమైంది. దీంతో రేటు రూ. 72,500 వద్ద ఉంది. ఇక దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దీంతో డాలర్ పుంజుకొని గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోతుంటాయి. కానీ ఈసారి అలా జరగలేదు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో కాస్త నెమ్మదించడమే కారణంగా తెలుస్తోంది. అయితే.. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచాయి. అంతకుముందు RBI కూడా రెపో రేటును పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement