నేటి బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. జూన్ 4న పసిడి రేటు రూ.500కు పైగా పరుగులు పెట్టింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,470కు చేరింది. రూ. 540 మేర పెరిగింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా రూ. 48,100కు ఎగసింది. రూ. 500 పెరిగింది. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. బంగారం ధరలు నిన్న కూడా పెరిగాయి. నిన్న పుత్తడి రేటు రూ. 110 వరకు పెరిగిన విషయం తెలిసిందే. అంటే కేవలం రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు రూ. 650 వరకు పెరిగాయి.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు నెల రోజుల గరిష్టానికి చేరాయి. అమెరికా డాలర్ బలహీనపడటం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. దీని వల్ల గోల్డ్ రేటు వరుసగా మూడో వారంలో కూడా ర్యాలీ చేసింది.
స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1867 డాలర్లకు చేరింది. మే 9 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. ఈ వారంలో బంగారం ధరలో 0.8 శాతం మేర పెరిగాయి. అలాగే అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ రేటు 1872 డాలర్లకు చేరింది. సిటీ ఇండెక్స్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ మ్యాట్ సింప్సన్ మాట్లాడుతూ.. పసిడి రేటు 1900 డాలర్లకు చేరొచ్చని అంచనా వేశారు. ఆర్థిక సంక్షోభ భయాలు బంగారం ధరలకు మద్దతు ఇవ్వనున్నాయని పేర్కొన్నారు. స్పాట్ గోల్డ్‌కు 1879 డాలర్ల వద్ద నిరోధం ఉందని, దీన్ని బ్రేక్ చేస్తే గోల్డ్ రేటు 1892 డాలర్ల స్థాయికి చేరొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. స్పా్ట్ గోల్డ్ రేటు ఈ వారం 1.1 శాతం పెరిగింది. 22.33 డాలర్లకు చేరింది.