Saturday, November 23, 2024

దూసుకుపోతోన్న బంగారం ధ‌ర‌లు – ఎక్క‌డెక్క‌డ ఎంతెంత‌

గ‌త మూడు రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు దూసుకుపోతూనే ఉన్నాయి. మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.1000కి పైగా పెరిగింద. అదేసమయంలో వెండి రేటు అయితే ఇక దాదాపు రూ. 3 వేలు దూసుకుపోయింది. దీంతో గోల్డ్ రేటు, సిల్వర్ రేటు పెరిగాయి. వీటిని కొనుగోలు చేయాలని భావించే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు వంటివి బంగారం ధర ర్యాలీకి దోహదపడుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 15 శుక్రవారం రోజున ఆర్నమెంటల్ బంగారం ధర రూ.200 పైకి చేరింది. దీంతో ఈ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 49,550కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. దీని రేటు రూ. 220 పెరుగుదలతో రూ.54,060కు ఎగసింది. అంటే బంగారం ధర ఇప్పుడు రూ.54 వేలు దాటిపోయింది. అదే వెండి ధర అయితే రూ.200 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 74,400కు చేరింది. ఈ స్థాయిలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిపోతుండటంతో కొనే వారికి ఎఫెక్ట్ పడుతోందని చెప్పుకోవచ్చు.

పుత్తడి రేటు గత మూడు రోజులుగా పైకి కదులుతూనే వస్తోంది. రూ.400, రూ.350, రూ.200.. ఇలా మూడు రోజుల్లోనే బంగారం ధర రూ. 950 పైకి చేరింది. ఇది 22 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. అదే 99.9 స్వచ్ఛత కలిగిన పసిడి రేటు రూ.430, రూ.390, రూ.220 చొప్పున పెరుగుతూ వచ్చింది. అంటే బంగారం ధర రూ.1000కి పైగా ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు. అదే వెండి విషయంలో అయితే నాలుగు రోజులుగా రేటు పెరుగుతూనే ఉంది. రూ. 800, రూ. 400, రూ. 1500, రూ.200 చొప్పున పెరిగింది. దీంతో వెండి రేటు రూ. 2,900 పైకి కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060 వద్ద ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.49,550. వెండి రూ. 70 వేలకు పెరిగింది. చెన్నైలో అయితే వెండి రూ. 74,400కు పెరిగింది. ఆర్నమెంటల్ గోల్డ్ రేటు రూ.50,050కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.54,600కు పెరిగింది. బెంగళూరులో బంగారం ధరలను గమనిస్తే.. 22, 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ. 49,550కు, రూ. 54,060కు చేరాయి. వెండి రేటు రూ. 74,400కు ఎగసింది. ముంబైలో చూస్తే వెండి రూ. 70 వేల వద్ద ఉంది. గోల్డ్ రేటు 22 క్యారెట్లకు రూ.49,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.54,060 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు వరుసగా 22 క్యారెట్లకు రూ. 49,550 వద్ద, 24 క్యారెట్లకు రూ. 54,060 వద్ద ఉన్నాయి. వెండి రూ.74,400 వద్ద ఉంది. కాగా ఈ గోల్డ్ రేట్లు అన్నీ 10 గ్రాములకు సంబంధించినవి. వెండి ధర కేజీకి సంబంధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement