Saturday, November 23, 2024

ప‌రుగులు పెడుతోన్న బంగారం..వెండి ధ‌ర‌లు

బంగారం ..వెండి ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో జూలై 23న బంగారం ధర రూ. 440 పైకి చేరింది. దీంతో పసిడి రేటు రూ. 50,620కు ఎగసింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాములకు రూ. 400 పైకి చేరింది. దీంతో ఈ బంగారం రేటు రూ. 46,400కు ఎగసింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది.

రూ. 600 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ. 61,600కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పైపైకి చేరింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం రేటు ఈరోజు పెరిగింది. 0.69 శాతం మేర ర్యాలీ చేసింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1725 డాలర్లకు ఎగసింది. కాగా నిన్న ఇంట్రాడేలో పసిడి రేటు ఏకంగా 1736 డాలర్ల స్థాయికి కూడా పెరగడం గమనార్హం. అయితే వెండి రేటు మాత్రం వెలవెలబోయింది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 1.11 శాతం దిగొచ్చింది. దీంతో వెండి రేటు ఔన్స్‌కు 18.51 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement