జూన్ 1న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 100 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 47,750కు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో పది గ్రాములకు రూ. 52,100కు క్షీణించింది. అయితే వెండి రేటు మాత్రం పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన వెండి రేటు నేడు రూ. 500 పైకి కదిలింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 67,500కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. పసిడి రేటు 0.62 శాతం తగ్గుదలతో 1837 డాలర్ల వద్ద కదలాడుతోంది. సిల్వర్ రేటు 0.76 శాతం క్షీణించింది. 21.52 డాలర్లకు తగ్గింది. అమెరికా డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడం వంటి అంశాల కారణంగా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన బంగారం కొనుగోలును రెట్టింపు చేసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ 65 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దీంతో ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వలు 760.42 టన్నులకు చేరింది. అసెట్ డైవర్సిఫికేషన్ పాలసీ ప్రకారం చూస్తే బంగారం మంచి పనితీరు కనబర్చింది. 2020 జూన్ నుంచి 2021 మార్చి వరకు చూస్తే అంటే తొలి 9 నెలల కాలంలో ఆర్‌బీఐ 33.9 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement