నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. తులం రూ.46 వేలపైకి చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.46,400గా రికార్డయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.50,620గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా భగ్గుమంది. వెండి రేటు ఏకంగా ఒక్క రోజే రూ.1,500 మేర పెరిగి.. కేజీ రూ.61,500కు చేరుకుంది. ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు మెరిశాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.600 పెరిగి రూ.46,550గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.50,780గా రికార్డయింది.
ఢిల్లీలో బంగారంతో పాటు వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి రేటు రూ.1,400 మేర పెరిగి, రూ.56,400కు చేరుకుంది. విజయవాడ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరల పెరుగుదల ఇదే స్థాయిలో ఉంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.600 పెరిగి రూ.46,400కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.50,620గా రికార్డయింది. బంగారంతో పాటు వెండి రేటు కూడా విజయవాడలో తళుక్కుమంది. వెండి రేటు ఏకంగా ఒక్క రోజే రూ.1,500 మేర పెరిగి.. కేజీ రూ.61,500కు చేరుకుంది.