నేడు బంగారం ధర హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గింది. రూ. 51,930కు క్షీణించింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 దిగి వచ్చింది. దీంతో ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 47,600కు తగ్గింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి రేటు రూ. 200 దిగొచ్చింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 61,100కు క్షీణించింది. కాగా వెండి రేటు నిన్న నిలకడగానే కొనసాగిన విషయం తెలిసిందే. పైన పేర్కొన్న ధరలకు జీఎస్‌టీ, తయారీ చార్జీలు వంటివి అదనం. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్నమెంటల్ గోల్డ్ రేటు రూ. 200 తగ్గుదలతో పది గ్రాములకు రూ. 47,750కు క్షీణించింది. వెండి రేటు రూ. 400 పడిపోయింది. కేజీకి రూ. 55,200 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో వెండి రేటు రూ. 61,100 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,150 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో చూస్తే బంగారం ధర రూ. 47,600 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. వెండి రేటు రూ. 400 పడిపోయింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 55,200 వద్ద ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement