నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..నేటి బంగారం ధర పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి రేటు ఈరోజు నిలకడగా కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్లో జూలై 25న బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900 వద్దనే కొనసాగుతోంది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాములకు రూ. 51,160 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర గత రెండు రోజుల్లో దాదాపు రూ. 1000 మేర పెరిగిన విషయం తెలిసిందే.
సిల్వర్ రేటు కూడా ఈ రోజు స్థిరంగా ఉంది. ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రేటు రూ. 61,200 వద్ద కొనసాగుతోంది. కాగా వెండి రేటు నిన్న రూ. 400 మేర పడిపోయింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.42 శాతం దిగివచ్చింది. 1720 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే సిల్వర్ రేటు కూడా ఇదే దారిలో పయనిస్తోంది. వెండి రేటు ఔన్స్‌కు 1.32 శాతం పడిపోయింది. ఔన్స్‌కు 18.37 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో పసిడి రేటు తగ్గినా దేశీ మార్కెట్లో బంగారం ధర నిలకడగా కొనసాగడం గమనార్హం.