Friday, November 22, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. దేశీయంగా బంగారం, వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ 22 క్యారెట్లకు ప్రస్తుతం రూ. 55940 వద్ద ఉండగా.. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.61,030 వద్ద కొనసాగుతోంది. ఇక దిల్లీ మార్కెట్‌లో బంగారం ధర 22 క్యారెట్స్ 10 గ్రాములకు రూ.56,090 వద్దట్రేడవుతుండగా.. ఇదే 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,180 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి రేటు కేజీకి రూ.81,600 మార్కు వద్ద ఉండగా.. ఇదే దిల్లీలో కిలోకు రూ.78,500 వద్ద ట్రేడవుతోంది.ఇక హైదరాబాద్‌తో చూస్తే గనుక దిల్లీలో బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. అదే వెండి రేటు విషయానికి వస్తే దిల్లీలో చాలా తక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులను బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి.అంతర్జాతీయంగా, జాతీయంగా, MCX మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు జీవన కాల గరిష్టాల వద్దే ఉన్నాయి. భారతీయులు ముఖ్యంగా మహిళలకు గోల్డ్ కొనుగోలు చేసి అలంకరణగా ఆభరణాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. వివాహాలు, ఇతర శుభకార్యాలు, పండగలు వంటి సమయాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం వీటిని కొనాలంటేనే జనం భయపడుతున్నారు. రేట్లు అలా షాక్ ఇస్తున్నాయి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement