నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 560 మేర పెరిగింది. దీంతో ముందురోజు రూ. 46 వేల 800 వద్ద ఉన్న రేటు రూ. 47 వేల 360కి పెరిగింది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే రూ.620 మేర ఎగబాకింది. దీంతో ఈ ధర రూ.51 వేల 670కి చేరింది. ఇక విజయవాడ మార్కెట్లోనూ దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. దిల్లీ మార్కెట్లో మాత్రం బంగారం రేట్లు కాస్త ఎక్కువ ఉంటాయి. సిల్వర్ విషయానికి వస్తే వరుసగా 5 రోజులుగా అస్సలు తగ్గలేదు. ఈ సమయంలో ఏకంగా రూ.3400 మేర పెరిగింది. ఒక్కరోజే రూ.700 మేర పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.700 పెరిగి రూ.67 వేల 400కు చేరింది. 5 రోజుల క్రితం ఈ రేటు రూ.64 వేలుగా ఉంది. దీంతో బంగారం కంటే వెండి కొనాలనుకునేవారికి షాక్ తగిలినట్లయింది. ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లు భారీగా పెంచితే మాత్రం డాలర్ రికార్డు స్థాయికి చేరడం ఖాయం. అప్పుడు మళ్లీ బాండ్లపై ప్రతిఫలాలు పెరిగి.. బంగారం ఇక ఏ మాత్రం సురక్షితమైన పెట్టుబడిగా భావించరు. అప్పుడు మళ్లీ రేట్లు పతనమవుతాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement