బంగారం..వెండి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇటీవల బంగారం ధర 9 నెలల గరిష్టాన్ని కూడా తాకింది. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.50,100 వద్ద ఉంది. ఇక అదే 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.54,630 వద్ద ట్రేడవుతోంది. ఇటీవలి కాలంలో ఇది రూ.55 వేల మార్కును కూడా దాటింది. దిల్లీలో సిల్వర్ రేటు భారీగా పెరిగింది. తాజాగా రూ.1200 పెరిగి కేజీకి రూ.72,300 పలుకుతోంది. ఇటీవలి కాలంలో అక్కడ ఇదే అత్యధికం కావడం విశేషం.
సాధారణంగా హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో సిల్వర్ ధరలో 3-4 వేల రూపాయల వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇప్పుడు రెండూ సమీపంలోకి వచ్చాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.49,950 వద్ద ఉంది. ఇటీవలి కాలంలో ఇది రూ.50 వేల మార్కును కూడా తాకింది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు హైదరాబాద్‌లో రూ.54,480 వద్ద కొనసాగుతోంది. ఇది రూ.55 వేల మార్కుకు చేరువలో వెళ్తోంది. ఇక్కడ వెండి రేటు రూ.200 పెరిగి కిలోకు రూ.74,200 వద్ద ఉంది.