నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు ఒక్కరోజే రూ.550 పెరిగింది. దీంతో తాజాగా అక్కడ గోల్డ్ రేటు రూ.56,650 మార్కు వద్ద ట్రేడవుతుండటం గమనార్హం. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ విషయానికి వస్తే ఇది ఒక్కరోజే రూ.600 పెరగ్గా ప్రస్తుతం రూ.61,800 మార్కు వద్ద ఉంది. అంతకుముందు రోజు మాత్రం గోల్డ్ రేటు రూ.100 మేర పడిపోయింది. ఇక దిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ ఒక్కరోజే రూ.550 పెరిగి ప్రస్తుతం రూ.56,800కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 ఎగబాకి రూ.61,950 మార్కును తాకింది. వెండి రేట్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పెరిగింది. దిల్లీలో కిలో వెండి రూ.1600 మేర పెరిగి ప్రస్తుతం రూ.79,600 మార్కు వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో రేటు చూస్తే షాకవ్వాల్సిందే. ఒక్కరోజే రూ.1200 మేర పెరగ్గా ప్రస్తుతం ఏకంగా రూ.83 వేల మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక ఈ ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. సాధారణంగా హైదరాబాద్‌లో గోల్డ్ రేటు తక్కువగా, దిల్లీలో సిల్వర్ రేటు తక్కువగా ఉంటాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement