Saturday, November 23, 2024

నేటి బంగారం..వెండి ధ‌రలు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.270 పెరిగి రూ.50,350 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.54,930కి చేరింది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దేశ రాజధానిలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 300 మేర ఎగబాకి రూ.50,500 వద్ద ఉంగా.. ఇక 24 క్యారెట్ల తులం గోల్డ్ దిల్లీలో రూ.330 పెరిగి రూ.55,080కి పెరిగింది. వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి రూ.500 మేర పెరిగి ప్రస్తుతం రూ.74,500కు చేరింది.

ఇదే దిల్లీలో రూ.1000 మేర పెరిగి రూ.71,300 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో వెండి రేటు మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది. అక్కడి పరిస్థితులు, స్థానిక పన్నులు దీనికి కారణం.అయితే వచ్చే ఏడాది బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరతాయని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న నేపథ్యంలో.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదించొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే డాలర్ పడిపోతుంది. అప్పుడు బంగారం, వెండి సహా ఇతర విలువైన లోహాల ధరలు పెరిగిపోతుంటాయి. వచ్చే ఏడాది అదే జరగనుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement