నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ.100 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం రేటు రూ.52 వేల 500 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి తులానికి 150 మేర దిగివచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్లకు రూ.57 వేల 230 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.52,650 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ దిల్లీలో రూ.150 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.57 వేల 380 వద్ద ట్రేడవుతోంది. వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే తగ్గుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.700 తగ్గింది. ప్రస్తుతం రూ.72,000 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని దిల్లీలో సిల్వర్ ధర కిలోకి రూ.500 దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర దిల్లీలో రూ.70,000 వద్ద కొనసాగుతోంది. దిల్లీ కంటే హైదరాబాద్‌లో బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది. వెండి రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ప్రాంతాలను బట్టి ట్యాక్స్ రేట్లలో మార్పులుంటాయి. అందుకే బంగారం, వెండి ధరల్లో ఈ హెచ్చుతగ్గులుంటాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement