Friday, November 22, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధర భారీగా పెరిగింది. తాజాగా రూ.350 పెరగ్గా.. తులం గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.52,850కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.380 ఎగబాకి.. ప్రస్తుతం రూ.57,650 మార్కును తాకింది. ఇక్కడ కూడా 2 నెలల్లో ఏకంగా రూ.7 వేలకుపైగా రేటు పెరగడం గమనార్హం. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.200 పెరిగి రూ.72,500కు చేరింది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో సిల్వర్ ధర కాస్త తక్కువగానే ఉంటుంది.

స్థానికంగా ఉండే పన్నులు, పరిస్థితులు దీనికి కారణం. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.700 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ.74 వేల మార్కుకు పడిపోయింది. ఇక్కడ ఇటీవల వరుసగా 4 రోజుల్లో సిల్వర్ రేటు ఏకంగా రూ.3700 తగ్గడం గమనార్హం. మళ్లీ 2 రోజుల్లో రూ.2600 పెరిగింది. అమెరికాలో పరిస్థితులు ప్రస్తుతం కాస్త ప్రతికూలంగానే ఉన్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫెడ్ సమావేశం వచ్చే నెలలో జరగనుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా పెంచితే.. బంగారం ధరలు తగ్గుతాయి. లేదంటే మరింత పెరిగే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement