Tuesday, November 26, 2024

నేడు బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి

నేడు బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు రూ.200 మేర పెరిగింది. దీంతో పసిడి ధర ప్రస్తుతం రూ.48,750కి చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ.210 మేర పెరిగి.. రూ.53,180కి చేరింది. దిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.48,800 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.53,330 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు ప్రాంతాలను బట్టి, అక్కడి పన్నులకు అనుగుణంగా మార్పులుంటాయి.వెండి విషయానికి వస్తే మాత్రం భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో ఒక్కరోజే రేటు రూ.1800 మేర పెరిగింది.

దీంతో ప్రస్తుతం ఇక్కడ కిలో సిల్వర్ రూ.69,800కు చేరింది. మరికొద్దిరోజుల్లో రూ.70 వేల మార్కును కూడా అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హైదరాబాద్‌తో పోలిస్తే వెండి రేట్లు దిల్లీలో చాలా తక్కువగా ఉంటాయి. దేశ రాజధానిలో తాజాగా కిలో వెండి రూ.2200 మేర పెరిగి.. రూ.63,600కు చేరినట్లయింది. అయినప్పటికీ.. ఇది ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువే.ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదిస్తుందన్న సంకేతాలతో డాలర్ ర్యాలీకి బ్రేక్ పడింది. దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడులపైకి మళ్లుతారు. అదే వడ్డీ రేట్లు పెంచితే మాత్రం డాలర్, బాండ్ ఈల్డ్స్‌పై ఆసక్తి పెరిగి.. వాటి విలువ పెరుగుతుంది. అదే సమయంలో బంగారం, వెండి వంటి లోహాల ధరలు పతనం అవుతుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement