Friday, November 22, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇవాళ 1947 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 22.86 డాలర్లకు దిగివచ్చింది. అమెరికా డాలర్ పుంజుకోవడంతో బంగారం పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణంగా చెప్పవచచు. మరోవైపు.. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో ఇవాళ డాలర్‌తో పోలిసతే రూ.82.748 మార్క్ వద్ద ఉంది. దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఇవాళ రూ.450 తగ్గి రూ.55 వేల 800 స్థాయికి పడిపోయింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ.490 పడిపోయింది.

ప్రస్తుతం రూ.60 వేల 870 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేట్లు చూసుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.450 పడిపోయి రూ.55 వేల 950 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.490 తగ్గి రూ.61 వేల 20 వద్ద ఉంది. వెండి విషయానికి వస్తే నాలుగు రోజుల్లో ఏకంగా కిలోపై రూ.2500 పడిపోయింది. రానున్న రోజుల్లో మరింత పడిపోయే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్‌‍లో కిలో వెండి రేటు రూ.1000 పడిపోయి రూ.76 వేల 500లకు పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.1000 పతనంతో రూ.73 వేల 50కి పడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement