Monday, November 18, 2024

పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా ఒక్కరోజే రూ.880 పెరిగింది. దీంతో తులం గోల్డ్ అక్కడ రూ.53,850కి చేరింది. నవంబర్ నెలలో గరిష్ట ధరనే రూ.53,180 కావడం గమనార్హం. దీంతో డిసెంబర్ ఒకటో తేదీనే సరికొత్త రికార్డుకు గోల్డ్ రేటు చేరిందన్నమాట. మరోవైపు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో పెద్దగా మారలేదు. ప్రస్తుతం రూ.48,550 వద్ద ఉంది.

వెండి విషయానికి వస్తే అంతర్జాతీయంగా భారీగా పెరిగినా దేశీయంగా ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.68 వేల వద్ద ఉంది. మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే రేట్లు ఉన్నాయి. హైదరాబాద్ మాదిరే విజయవాడల్లో రేట్లు ఉంటాయి. అయితే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా, వెండి ధర కాస్త తక్కువగా ఉంటాయి. స్థానిక పన్నులను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement