బంగారం ధరలు రోజు రోజుకి మారుతుంటాయి. కాగా నేడు ఆదివారం బంగారం ధరలు ఏ విధంగా ఉన్నయో చూద్దాం. గత వారం ప్రారంభంలో 24క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.49,150లు ఉండగా నేడు.. రూ.48,820కు పడిపోయింది. అంటే ఈ ఏడు రోజుల్లో దాదాపు రూ.330 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా గత వారం ప్రారంభంలో రూ.45,050 లు ఉండగా నేడు రూ.44,750లుగా నమోదయ్యింది. దీంతో పసిడి కొనాలనుకునేవారికి కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర రూ. 4,445 లు ఉండగా రూ. 30 పెరిగి ఈరోజు రూ. 4,475లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 44,450 ఉండగా రూ. 300లు మేర పెరిగి .. ఆదివారానికి రూ. 44,750లు గా నమోదైంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,849లు ఉండగా నేడు రూ.33పెరిగి నేడు రూ. 4,882లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. శనివారం రూ. 48,490 లు ఉండగా.. ఆదివారానికి రూ. 330 మేర పెరిగి నేడు 48,820 లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర వారం రోజుల వ్యవధిలోనే భారీగా దిగివచ్చినా ..నిన్నటి నుంచి ఈరోజుకి స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది. వెండి కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ .
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..