నేడు బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి..దేశీయంగా చూస్తే గనుక దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.50 వేలుగా ఉంది. ఆదివారం రోజు ఇందులో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర దిల్లీలో రూ.54,530 వద్ద ఉంది. ఇక్కడ వెండి రేటు కిలోకు రూ.71,100 గా ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వెండి ధర కాస్త తక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లోనూ బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. వీటికి స్థానిక పన్నులు, పరిస్థితులే కారణం.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.49 వేల 850 వద్ద ఉంది. ఇటీవలి కాలంలో ఇందులో భారీగా ఛేంజ్ కనిపిస్తోంది. రూ.50 వేల మార్క్ కూడా దాటింది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో ఇటీవల రూ.55 వేలకు చేరువలో కూడా వెళ్లింది. ప్రస్తుతం ఇది రూ.54,380 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ఇక్కడ కిలోకు సరిగ్గా రూ.74 వేలు పలుకుతోంది. ఇటీవలి కాలంలో రూ.75 వేల మార్కుకు కూడా చేరువైంది. రానున్న రోజుల్లో రూ.75 వేలు దాటే అవకాశం కూడా కనిపిస్తోంది.