Tuesday, November 26, 2024

మళ్లీ పెరిగిన పుత్తడి ధరలు

మన దేశంలో బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 43, 500 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 47, 460 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా అదే దారి పట్టాయి. కిలో వెండి ధర రూ. 900 పెరిగి రూ. 64,600 పలుకుతుంది.

ఇది కూడా చదవండి: మా ఎల‌క్ష‌న్స్: తుది అభ్య‌ర్ధుల జాబితా ఇదే..!

Advertisement

తాజా వార్తలు

Advertisement