Saturday, November 23, 2024

భారీగా పడిపోయిన బంగారం ధరలు

బంగారం ధర వెలవెలబోయింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. వెండి కూడా నేలచూపులు చూసింది. తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి 50,100కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 1600 తగ్గి రూ.75,700కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement