Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు..

జూలై 5న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం రేటు స్థిరంగానే ఉంది. 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 52,340 వద్ద కొనసాగుతోంది. పది గ్రాములకు ఇది వర్తిస్తుంది. 22 క్యారెట్ల పసిడి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాములకు రూ. 48 వేల వద్దనే ఉంది. ధరల్లో మార్పు లేదు. బంగారం ధరలు స్థిరంగా ఉంటూ రావడం ఇది వరుసగా రెండో రోజు. గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 53,150కు చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ. 53,850కు తగ్గొచ్చు. బంగారం ధర రూ. 51,535 పైన కదలాడితే బుల్లిష్ అని తెలియజేస్తున్నారు.

బంగారం మునపటి ముగింపు రూ. 51,917గా ఉంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) ప్రకారం చూస్తే.. 999 గోల్డ్ రేటు రూ. 52,218గా ఉంది. 995 గోల్డ్ రేటు రూ. 52,009 వద్ద కొనసాగుతోంది. 916 గోల్డ్ రేటు రూ. 47,832 వద్ద ఉంది. 750 గోల్డ్ రేటు రూ. 39,164గా కొనసాగుతోంది. అలాగే 585 గోల్డ్ రేటు రూ. 30,548 వద్ద ఉంది. సిల్వర్ రేటు కేజీకి రూ. 58,123 వద్ద కొనసాగుతోంది. ఈ రేట్లను జీఎస్‌టీ, ఇతర చార్జీలు అదనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement