నేడు బంగారం ధర కొండెక్కింది. దాంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి రేటు మరింత పైపైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పెరుగుదల కారణంగా దేశీ మార్కెట్లోనూ అదే ట్రెండ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.49,850కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది.
రూ.400 పెరుగుదలతో రూ.45,700కు ఎగసింది.బంగారం ధర పైకి కదిలితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ ధర మరింత పైపైకి చేరింది. రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,900కు ఎగసింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.01 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1798.35 డాలర్లకు చేరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..