Friday, November 22, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేడు బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. ఇక వెండి ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి మళ్లీ రూ.46 వేలకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.530 తగ్గి రూ.50,200గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా కుప్పకూలాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.1000 మేర తగ్గడంతో.. ఈ ధర రూ.61,500కి దిగొచ్చింది. ఈ వారం ప్రారంభం నుంచి మూడు సార్లు ధరలు తగ్గగా.. 3 సార్లు ధరలు పెరిగాయి. హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి ఢిల్లీలో రూ.46,150గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గి రూ.50,350గా రికార్డయింది. బంగారంతో పాటు దేశ రాజధానిలో వెండి రేట్లు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.500 మేర తగ్గడంతో.. ఈ రేటు రూ56,300గా రికార్డయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement