Saturday, November 23, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌-దూసుకుపోతోన్న వెండి

నేడు బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి.దాంతో జూలై 15న హైదరాబాద్‌లో బంగారం ధర జిగేల్ మంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 210 మేర పెరిగింది. దీంతో ఈ పుత్తడి రేటు రూ. 51,160కు చేరింది. ఇంకా 22 క్యారెట్ల బంగారం రేటు కూడా మెరిసింది. ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేటు రూ. 200 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు తులం రూ. 46,900కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పైకి చేరడం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి రేటు పైపైకి కదిలింది. గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.16 శాతం మేర పెరిగింది.

దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1708 డాలర్లకు చేరింది. పుత్తడి దారిలోనే వెండి కూడా పయనించింది. వెండి రేటు ఔన్స్‌కు 0.58 శాతం మేర పెరిగింది. ఇప్పుడు సిల్వర్ రేటు 18.33 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలో కూడా వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సిల్వర్ రేటు దూసుకుపోయింది. వెండి ధర రూ. 600 మేర పరుగులు పెట్టింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 62,300కు చేరింది. వెండి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సిల్వర్ జువెలరీ, కడియాలు, పట్టీలు కొనాలని చూసే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement