బంగారం ధరల్లో రోజు రోజుకి మార్పులు వస్తుంటాయి. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు నేడు పైకి కదిలాయి. జూన్ 3న బంగారం ధర రూ. 110 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,930కు ఎగసింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అదేసమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు (Gold Rate) రూ. 100 పెరుగుదలతో రూ. 47,600కు ఎగసింది. హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ ధర (Silver Rate) ఈరోజు స్థిరంగా ఉంది. ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రేటు రూ. 67 వేల వద్ద కొనసాగుతోంది. కాగా వెండి రేటు నిన్న రూ. 500 పడిపోయింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధరలపై ప్రభావం చూపే గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 0.28 శాతం పెరిగింది. 1876 డాలర్ల పైన కదలాడుతోంది. అలాగే వెండి రేటు అయితే 0.79 శాతం ర్యాలీ చేసింది. ఔన్స్‌కు 22.44 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement