నేటి బంగారం ధరలు కాస్త తగ్గాయి. కాగా వెండి రేటు కూడా తగ్గింది. ఆగస్ట్ 18న హైదరాబాద్‌లో పసిడి రేటు వెలవెలబోయింది. వెండి రేటు కూడా నేలచూపులు చూసింది. బంగారం వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. భాగ్యనగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 మేర దిగి వచ్చింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 52,250కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. రూ. 100 క్షీణించింది. రూ. 47,900కు దిగి వచ్చింది. బంగారం ధర గత రెండు రోజుల్లో చూస్తే రూ. 280 వరకు పడిపోయింది.
వెండి రేటు విషయానికి వస్తే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు రూ. 100 తగ్గింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 63,300కు దిగి వచ్చింది. సిల్వర్ రేటు నిన్న భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. రూ. 1400 మేర పతనమైంది. కాగా పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, తయారీ చార్జీలు వంటివి అదనం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.24 శాతం మేర పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1780 డాలర్లకు చేరింది. అలాగే సిల్వర్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు 0.21 శాతం పైకి చేరింది. దీంతో సిల్వర్ రేటు ఔన్స్‌కు 19.77 డాలర్లకు ఎగసింది.