Saturday, November 23, 2024

త‌గ్గిన బంగారం ధ‌ర‌- పెరిగిన వెండి రేటు

గ‌త రెండు రోజులుగా బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో జూన్ 25న బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 పడిపోయింది. దీంతో ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 47,450కు క్షీణించింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు అయితే రూ. 230 పడిపోయింది. పది గ్రాములకు దీని రేటు రూ. 51,760కు తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. రెండు వారాలుగా గోల్డ్ రేటు పడిపోతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు 0.09 శాతం తగ్గుదలతో ఔన్స్‌కు 1828 డాలర్లకు క్షీణించింది.

అయితే వెండి ధర మాత్రం పెరిగింది. 0.42 శాతం పైకి చేరింది. ఔన్స్‌కు 21.13 డాలర్ల వద్ద కదలాడుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు సిల్వర్ రేటులో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రేటు రూ. 66 వేల వద్దనే కొనసాగుతోంది. సిల్వర్ రేటు రెండు రోజులుగా స్థిరంగానే ఉంటూ వస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో వెండి ధర 22.5 నుంచి 20.5 డాలర్ల స్థాయిలో కదలాడుతోందని జియోజిత్ తెలిపింది. ఈ శ్రేణిలో ఎటువైపు సిల్వర్ రేటు లిమిట్ క్రాస్ చేస్తే అటువైపు ట్రెండ్ ఉండొచ్చని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement