Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు..22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే రూ. 550 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550 తగ్గి.. రూ.46,200కు పడిపోయింది. అంతకుముందు రోజు ఇది రూ. 46,750 వద్ద ఉండేది. అదే 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.600 పడిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 50,400 వద్ద ఉంది. బంగారం ధర గత 6 రోజుల్లో ఏకంగా రూ.1650 తగ్గింది. కాబట్టి పండగ వేళ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. వెండి విషయానికి వస్తే గత 10 రోజుల్లో రూ.6500 మేర తగ్గింది. ఇప్పుడు ఒక్కరోజే ఏకంగా రూ.1800 తగ్గి ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.60,500 వద్ద ఉంది. అక్టోబర్ 6న ఈ రేటు రూ.66,500 వద్ద ఉండటం గమనార్హం. ఇక దిల్లీలో గోల్డ్ రేట్లు రూ.550 మేర తగ్గాయి. దేశ రాజధానిలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రేటు రూ.50,550కి చేరింది. దిల్లీ కిలో వెండి రూ.2 వేల మేర పతనమైంది. అక్కడ కిలో సిల్వర్ ధర కనిష్టంగా రూ.55,300కు పడిపోవడం విశేషం. అంతకుముందు రోజు ఇది రూ.57,300 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement