Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.400 పెరిగి రూ.48,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 ఎగిసి రూ.52,530గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా జిగేల్‌మంది. కేజీ వెండి రేటు రూ.400 పెరిగి రూ.64,800గా రికార్డయింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా బంగారం ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి.

విజయవాడలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.48,150గా, అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.52,530గా ఉంది. విజయవాడలో సిల్వర్ రేటు రూ.400 పెరిగి రూ.64,800గా రికార్డయింది..అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ డేటా డాలర్ ఇండెక్స్‌ను 5 వారాల కనిష్ట స్థాయిలకి పడేసింది. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement