పసిడి ప్రియుకులకు గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఆదివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.66,100కు చేరుకుంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850గా ఉంది. కిలో వెండి ధర రూ. 66,100గా పలుకుతోంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200 కి చేరింది. వెండి ధర రూ. 62,200 గా ఉంది. ఇక, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,690 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,690 కి చేరింది. అలాగే వెండి ధర రూ. 62,200గా ఉంది. కోల్‌కత్తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850గా నమోదైంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,550గా పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ. 62,200 గా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..