Wednesday, November 20, 2024

పరుగులు పెడుతున్న బంగారం

బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు షాక్. పసిడి రేటు పరుగులు పెడుతోంది. బంగారం ధర బాటోలనే వెండి రేటు కూడా నడుస్తోంది. గత రెండు రోజులుగా పసిడి ధర పెరుగుతోంది. పసిడి రేటు ఈరోజు కూడా పైకి కదిలింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు. గత 2 రోజుల్లో రూ.1,350 ఎందుకు పెరిగింది. తాజాగా ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 530 రూపాయలు పెరిగింది. శుక్రవారం 43,370 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు 43,900 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 600 మేర పెరిగింది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,440 గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,090గా ఉంది. ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,090కి చేరింది.

మరోవైపు వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి ధర గత 10 రోజుల్లో రూ.3200 తగ్గగా… రూ.2,800 పెరిగింది. నిన్న, మొన్న భారీగా పెరిగింది. నేటి ఉదయం ధరను పరిశీలిస్తే… కేజీ వెండి ధర రూ.70,000 ఉంది. నిన్న రూ.1300 పెరిగింది. మొన్నటివరకూ భారీగా పడిపోయిన పసిడి ఇప్పుడిలా పెరిగిపోవడానికి అంతర్జాతీయ, దేశీయ పరిణామాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. నెల రోజులుగా డాలర్ బలహీనపడుతోంది. అందువల్ల డాలర్‌పై పెట్టుబడి పెట్టడం వేస్ట్ అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement