Saturday, November 23, 2024

Gold Rate: పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర

పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. నిన్నటి వరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. అయితే, వెండి రేటు మాత్రం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 49,300కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుదలతో రూ. 45,200 ఎగసింది. బంగారం ధరలు పైకి కదిలితే వెండి మాత్రం రూ.100 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.64,900కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,200కు చేరింది. కేజీ వెండి ధర రూ.61,600కి చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 45,200కు ఎగసింది. కేజీ వెండి ధర రూ. 61,600గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement