బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధర వరసగా రెండో రోజు పెరిగింది. జిగేల్ మంటోంది.
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 49,600కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 360 పెరుగుదలతో రూ. 45,460కు ఎగసింది. అయితే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా.. స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర 66,600 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,460 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,600కి చేరింది. కిలో వెండి ధర రూ. 66,600 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,610 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,940 కి చేరింది. కిలో వెండి ధర రూ. 66,700 గా నమోదైంది.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,160 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,160 కి చేరింది.
అలాగే కిలో వెండి ధర రూ. 66,700 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.