Tuesday, November 19, 2024

పెరిగిన బంగారం ధ‌ర – త‌గ్గిన వెండి

నేడు కూడా బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి. జూన్ 18న పసిడి రేటు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో గమనిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర మరోసారి దూసుకుపోయింది. రూ. 230 మేర పెరిగింది. దీంతో ఈ బంగారం రేటు రూ. 52,100కు ఎగసింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే.. ఈ పసిడి రేటు తులానికి రూ. 200 పెరిగింది. రూ. 47,750కు చేరింది. బంగారం ధరలు రెండు రోజుల్లోనే రూ. 660 మేర పరుగులు పెట్టింది. వెండి రేటు విషయానికి వస్తే.. గ్లోబల్ మార్కెట్‌లో కూడా సిల్వర్ రేటు తగ్గింది. ఔన్స్‌కు వెండి రేటు 1.17 శాతం మేర క్షీణించింది. దీంతో వెండి ధర ఔన్స్‌కు 21.6 డాలర్లకు తగ్గింది. ఇక మన దేశంలో వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీకి రూ. 66 వేల వద్దనే కొనసాగుతోంది. వెండి రేటు స్థిరంగా ఉంటూ రావడం ఇది వరుసగా మూడో రోజు.

Advertisement

తాజా వార్తలు

Advertisement