Saturday, November 23, 2024

పెరిగిన బంగారం ధ‌ర – వెండి వెల వెల‌

నేడు బంగారం ధ‌ర‌లు పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బంగారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 చొప్పున పెరిగాయి. దీంతో పసిడి రేటు వరుసగా రూ.49,050కు, రూ.45,100కు చేరాయి. వెండి ధర మాత్రం వెలవెలబోయింది. కేజీ వెండి రేటు రూ. 100 తగ్గింది. దీంతో సిల్వర్ రేటు రూ.61,400కు క్షీణించింది. ముంబైలో బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.670 పెరుగుదలతో రూ. 49,650కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరుగుదలతో రూ. 45,500కు చేరాయి. వెండి రేటు రూ. 100 క్షీణతతో రూ. 61,400కు తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదిలింది. దీంతో పసిడి రేటు రూ. 49,200కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 45,100కు చేరింది. ఇకపోతే వెండి మాత్రం నిలకడగానే కొనసాగింది. స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.65,600 వద్దనే కొనసాగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement