బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. వరుసగా రెండో రోజు పసిడి ధర పరుగు పెట్టింది. అయితే, వెండి ధర మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.45,450కు ఎగసింది. వెండి రేటు ధర మాత్రం రూ.200 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,000కు క్షీణించింది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,000గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,900 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,600కి వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి ధర రూ. 62,300 గా నమోదైంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,240గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,240 గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కత్తలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,100కి ఎగసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,400కి చేరింది. అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 62,300గా ఉంది.