Tuesday, November 19, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌లు – ప‌లు న‌గ‌రాల్లో రేట్లు ఇవే

బంగారం ధ‌ర దూసుకుపోతోంది. హైద‌రాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర రూ.250 పెరిగింది. గురువారం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.45,550గా ఉంటే.. శుక్రవారం ఈ ధర రూ.45,800కి ఎగిసింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.280 పెరిగి రూ.49,970కు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగినప్పటికీ.. సిల్వర్ ధరలు మాత్రం ఎక్కడివి అక్కడే ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.66,800 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు మరింత పెరిగాయి.

22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.390 పెరిగి రూ.45,410 నుంచి రూ.45,800కు చేరుకుంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.430 ఎగిసింది. తమిళనాడులోని చెన్నైలో బంగారం ధరలు రూ.230 పెరిగాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.45,780 నుంచి రూ.46,010కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 నుంచి రూ.50,200కు ఎగిసింది. బెంగళూరులో బంగారం ధర రూ.250 పెరిగి 22 క్యారెట్లు రూ.45,800గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగింది. దీంతో రూ.49,690 నుంచి రూ.49,970కు ధర ఎగిసింది. సిల్వర్ రేటు రూ.66,800గానే నమోదైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement