పసిడి ప్రియులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బంగారం ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. అయితే, వెండి ధర మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర రూ.20 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,970కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,070కు తగ్గింది. బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. వెండి రేటు మాత్రం రూ.300 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.65,800కు చేరింది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,970 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,070 కి చేరింది. అలాగే కిలో వెండి ధర రూ. 65,800 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,140గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,430కి చేరింది. కిలో వెండి ధర రూ. 61,700 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,090గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,090కి చేరింది. ఇక, కిలో వెండి ధర రూ. 61,700 వద్ద కొనసాగుతోంది.