Tuesday, November 19, 2024

Gold News: మహిళలకు గడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. అయితే, వెండి రేటు మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.45,350కు చేరింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం ధర మాత్రం రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,300కు చేరింది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.. విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 66,300 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,800 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,500 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 62,500గా నమైదైంది.

ఇక, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,220 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,220 గా ఉంది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 వద్ద కొనసాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement