Saturday, November 23, 2024

పసిడి ప్రియులకు షాక్.. రూ.50 వేలు దాటిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి రేటు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 50,100కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ. 45,900కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,500కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది. వెండి రేటు రూ.64,200కు చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,830 ఉంది. వెండి రేటు రూ. 100 పెరుగుదలతో రూ. 64,200కు ఎగసింది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement