Wednesday, November 20, 2024

మళ్లీ పెరిగిన పసిడి ధరలు

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈసారి ధర పెరిగింది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం హైదరాబాద్ లో బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,010 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,830 రూపాయలు ఉంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర 71,000 రూపాయలు ఉంది.

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,160 రూపాయలు ఉంది. ఇక అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,170 రూపాయలు ఉంది. కేజీ వెండి మాత్రం 66,900 రూపాయలు ఉంది. హైదరాబాదు తో పోల్చుకుంటే ఢిల్లీలో వెండి ధర 4500 రూపాయలు తక్కువగా ఉంది.

మరోవైపు విశాఖ పట్నం, విజయవాడ లో చూసుకుంటే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 42,010 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 రూపాయలు పెరిగి 45,830 రూపాయలకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement