Tuesday, November 26, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు..

ఈ నెలలో రెండోసారి బంగారం ధర భారీగా దిగొచ్చింది. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540 మేర ధర తగ్గింది. ఇది పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620కి దిగి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఒకే ధరలు కొనసాగుతున్నాయి. ఈ మూడు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,770గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,430 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,650గా ఉంది. ఈరోజు వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 1 గ్రాము వెండి ధర రూ.58.80, ఒక కిలో వెండి ధర రూ.58,800 వెండి పురాతన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధి చెందినది. ప్రస్తుతకాలంలో పెళ్లి వేడుక‌ల్లో సైతం బంగారం త‌ర్వాత వెండికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement